ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ

- సుమారు గంటకు పైగా కొనసాగిన సమావేశం
- ‘రైతు భరోసా’ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా మోదీకి ఆహ్వానం
- ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరిన జగన్
విభజన హామీల అమలు, రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని ప్రధానిని కోరినట్టు తెలుస్తోంది. కాగా, మోదీతో భేటీ అనంతరం బయటకొచ్చిన జగన్ ని మీడియా పలకరించింది. అయితే, మీడియాతో జగన్ మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
