Telangana: ముగిసిన సర్కార్ డెడ్ లైన్.. విధుల్లో చేరని టీఎస్సార్టీసీ కార్మికులు!

  • ఈరోజు సాయంత్రం ఆరు లోగా సమ్మె విరమించాలన్న ప్రభుత్వం
  • పట్టించుకోని టీఎస్సార్టీసీ కార్మిక సంఘాలు
  • రాష్ట్రంలో కొనసాగుతున్న కార్మికుల సమ్మె

సమ్మెకు దిగిన టీఎస్సార్టీసీ కార్మికులకు ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ సమయం ముగిసింది. ఈరోజు సాయంత్రం ఆరు గంటల్లోగా విధుల్లో చేరాలని లేనిపక్షంలో ఉద్యోగాల నుంచి కార్మికులను డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ హెచ్చరికలను టీఎస్సార్టీసీ కార్మిక సంఘాలు ఖాతరు చేయలేదు. డెడ్ లైన్ ముగిసినా కార్మికుల నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఇదిలా ఉండగా, కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నారు. ప్రైవేట్ బస్సులను రంగంలోకి దింపనున్నారు. కాసేపట్లో భవిష్యత్ ప్రణాళికపై తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటన చేయనున్నట్టు సమాచారం.

More Telugu News