China: రూ.2.68 లక్షల కోట్ల బంగారాన్ని వెనకేశాడు... లంచగొండితనానికి విశ్వరూపం!

  • చైనాలో అవినీతి పర్వతం
  • మాజీ మేయర్ నివాసంలో సోదాలు
  • ఎక్కడ చూసినా బంగారు ఇటుకలు, కడ్డీలు దర్శనం

ఎంత అవినీతికి పాల్పడినా ఓ వంద కోట్లో, మహా అయితే రెండు మూడొందల కోట్లో సంపాదిస్తారేమో! కానీ చైనాలో ఓ మహానుభావుడు ఏకంగా 13,500 కిలోల బంగారం సంపాదించాడు. చైనాలోని హైనాన్ ప్రావిన్స్ లోని హైకౌర్ సిటీ మాజీ మేయర్ ఝాంగ్ కీ గురించి చెప్పాలంటే అవినీతికి అచ్చమైన పర్యాయపదం అనుకోవాలి. ఇటీవల అతడి అవినీతి భాగోతాలపై ఫిర్యాదులు అందుకున్న అధికారులు సోదాలు నిర్వహించి నివ్వెరపోయారు. అతడి ఇంట్లో గుట్టలుగుట్టలుగా బంగారం బయటపడింది.

ఎక్కడ చూసినా బంగారు కడ్డీలు, బంగారు ఇటుకలే! వాటి విలువ లెక్కిస్తే రూ.2.68 లక్షల కోట్లని తేలింది. ఇవేకాదు, 37 బిలియన్ డాలర్ల మేర నగదు, ఇతర స్థిరాస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచ వ్యాపార దిగ్గజాలు సైతం సంపాదించలేనంత సొమ్మును మేయర్ గా పనిచేసిన ఓ వ్యక్తి సంపాదించడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఝాంగ్ కీ ఈ సంపాదన అంతా అక్రమ మార్గాల్లో పోగుచేశాడు. ఆ బంగారం ఉంచడానికి పెద్ద పెద్ద ర్యాకులను కూడా తయారుచేయించాడు.

More Telugu News