Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి

  • ఏపీ హైకోర్టుకు తొలిసారి పూర్తిస్థాయి సీజే
  • త్వరలోనే ప్రమాణ స్వీకారం
  • ప్రస్తుతం మధ్యప్రదేశ్ హైకోర్టులో మహేశ్వరి విధులు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి నియమితులయ్యారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను ఏపీ హైకోర్టు సీజేగా నియమిస్తూ గురువారం కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహేశ్వరితో త్వరలోనే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్‌ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంటూ గతంలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్స్‌ను కేంద్రం తిరస్కరించింది. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్‌వీ రమణలతో కూడిన కొలీజియం జస్టిస్ జీకే మహేశ్వరి పేరును కేంద్రానికి సిఫారసు చేయగా అంగీకరించింది. ఆయన నియామకానికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. దీంతో ఏపీ హైకోర్టుకు తొలిసారి పూర్తిస్థాయి సీజే నియామకానికి మార్గం సుగమమైంది.

More Telugu News