Huzurnagar: హుజూర్‌నగర్‌లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణల పర్వం.. బరిలో 28 మంది!

  • నిన్నటితో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
  • చివరి రోజున నామినేషన్లు వెనక్కి తీసుకున్న ముగ్గురు స్వతంత్రులు 
  • అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులో అధికారులు

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తుది అంకానికి చేరుకుంది. గురువారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 76 మంది నామినేషన్లు దాఖలు చేయగా వాటిలో 45 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో 31 మంది బరిలో నిలిచారు. బుధ, గురువారాల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వగా, చివరి రోజు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో చివరికి 28 మంది బరిలో నిలిచినట్టు రిటర్నింగ్ అధికారి చంద్రయ్య తెలిపారు. బరిలో మిగిలింది 28 మందే కావడంతో రెండు బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించనుండగా, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు.

బరిలో నిలిచిన వారిలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి పద్మావతి, బీజేపీ నుంచి కోటా రామారావు, తెలుగుదేశం నుంచి చావా కిరణ్మయిలు ఉండగా, వివిధ పార్టీలకు చెందిన 9 మంది, 15 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.

More Telugu News