Sensex: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 198 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 45 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 34 శాతం వరకు పెరిగిన యస్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. పరిస్థితులు చూస్తుంటే మరోసారి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదంటూ వస్తున్న వార్తలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 198 పాయింట్లు పతనమై 38,106కి పడిపోయింది. నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 11,314 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (33.91%), టాటా మోటార్స్ (6.37%), ఐటీసీ (2.03%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.58%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.50%).

టాప్ లూజర్స్:
వేదాంత లిమిటెడ్ (-4.82%), టాటా స్టీల్ (-3.41%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.84%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-2.05%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.04%).

More Telugu News