YSRCP: డిస్టిలరీల నుంచి రూ. 2వేల కోట్ల జే-ట్యాక్స్ వసూలు చేస్తున్నారు: కొల్లు రవీంద్ర

  • ఇష్టానుసారం మద్యం ధరలను పెంచారు
  • ప్రభుత్వ ఉద్యోగులతో మద్యం అమ్మించడం సిగ్గుచేటు
  • ఏపీని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారు

మద్యం రూపంలో ఏపీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇష్టానుసారం మద్యం ధరలను పెంచారని, డిస్టిలరీల నుంచి రూ. 2 వేల కోట్ల జే-ట్యాక్స్ ను వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మద్యం అమ్మకాల ద్వారా ప్రజలను దోచుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో మద్యం అమ్మించడం సిగ్గుచేటని అన్నారు. బడి, గుడి అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ను మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారని విమర్శించారు. మద్యం అమ్మకాలను వ్యతిరేకిస్తున్న మహిళలపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారని తెలిపారు.

More Telugu News