Vijayawada: 'స్వచ్ఛ రైలు' నిర్వహణలో విజయవాడకు 7వ ర్యాంకు!

  • స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా ర్యాంకులు
  • నాంపల్లికి 17, సికింద్రాబాద్‌కు 42వ స్థానాలు
  • తొలి మూడు స్థానాల్లో జైపూర్, జోధ్‌పూర్, దుర్గాపుర స్టేషన్లు

స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రైలు నిర్వహణపై రైల్వేశాఖ మంత్రి పియూష్‌ గోయెల్‌ బుధవారం 611 ర్యాంకులను ప్రకటించారు. ఇందులో ఏపీలోని ప్రధాన రైల్వే స్టేషన్ అయిన విజయవాడ 908.81 మార్కులతో ఏడో స్థానాన్ని కైవసం చేసుకోగా, తెలంగాణలోని సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్లు టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయాయి. ఏపీలోని సామర్లకోట 45, తిరుపతి 70, నెల్లూరు 81, విశాఖ 84, పలాస 92, అనంతపురం 105, ఏలూరు 107వ ర్యాంకులను దక్కించుకున్నాయి.

తెలంగాణలోని నాంపల్లి రైల్వే స్టేషన్‌కు 17వ స్థానం లభించగా, సికింద్రాబాద్ ఏకంగా 42వ స్థానంలో నిలిచింది. వరంగల్‌ 51, రామగుండం 52, కాజీపేట 67, కాచిగూడ 69, ఖమ్మం 80 స్థానాలు దక్కించుకున్నాయి. స్వచ్ఛ రైలు ర్యాంకుల్లో జైపూర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, జోధ్‌పూర్, దుర్గాపుర స్టేషన్లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.  

More Telugu News