Virat Kohli: కోహ్లీ ఫొటో, రికార్డుల టాటూలతో నిండిపోయిన అభిమాని శరీరం.. దగ్గరకు తీసుకుని వాటేసుకున్న కెప్టెన్!

  • అభిమాని శరీరంపై తన ఫొటో చూసి షాకైన కోహ్లీ
  • విశాఖ స్టేడియంలో ఘటన
  • సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

దీనిని ఏమంటారో తెలియదు కానీ ఓ అభిమాని కోహ్లీ ఫొటో, జెర్సీ నంబరు, అతడు సాధించిన రికార్డులు.. ఇలా అన్నింటినీ తన శరీరంపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అది చూసిన కోహ్లీ ఉద్వేగంతో ఉప్పొంగిపోయాడు. అతడిని దగ్గరకు తీసుకుని వాటేసుకున్నాడు. విశాఖపట్టణంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఈ ఘటన చోటుచేసుకుంది.

మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానంలో ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తనను కలిసిన ఓ అభిమానిని చూసి కోహ్లీ తొలుత ఆశ్చర్యపోయాడు. తన ఫొటో, జెర్సీ నంబరు, తాను సాధించిన రికార్డులు ఇలా.. అన్నీ అభిమాని శరీరంపై పచ్చబొట్టు రూపంలో కనిపించడంతో కోహ్లీ ఓ క్షణం షాక్‌కు గురయ్యాడు. ఆ వెంటనే తేరుకుని అతడిని దగ్గరకు తీసుకుని వాటేసుకున్నాడు. అతడితో కలిసి ఫొటో దిగాడు. సోషల్ మీడియాలో ఇప్పుడీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

More Telugu News