Bandla Ganesh: నాకు మళ్లీ చాన్స్ ఇవ్వండి లిటిల్ బాస్!... రామ్ చరణ్ కు బండ్ల గణేశ్ విన్నపం

  • చరణ్ తో గోవిందుడు అందరివాడేలే చిత్రం తీసిన బండ్ల గణేశ్
  • మరో సినిమా తీసి బ్లాక్ బస్టర్ ఇస్తానంటూ ధీమా
  • లిటిల్ బాస్ అంటూ చరణ్ ను పేర్కొన్న బండ్ల గణేశ్

గతంలో రామ్ చరణ్ హీరోగా బండ్ల గణేశ్ నిర్మాణంలో 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఆ ఫ్యామిలీ ఎంటర్టయినర్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా 2014లో అక్టోబరు 1న రిలీజైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్మాత బండ్ల గణేశ్ ట్విట్టర్ లో స్పందించారు. రామ్ చరణ్ ను లిటిల్ బాస్ గా పేర్కొంటూ, మళ్లీ మీతో ఓ సినిమా తీయాలనుందని, ఆ సినిమాను బ్లాక్ బస్టర్ గా ప్రజల ముందు ఉంచాలని భావిస్తున్నానని ట్వీట్ చేశారు. 'లిటిల్ బాస్ నాకు త్వరగా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను' అంటూ బహిరంగ విజ్ఞప్తి చేశారు.

More Telugu News