ap7am logo

'బాస్ బస్టర్' హిట్ కు థాంక్యూ నాన్నా: రామ్ చరణ్

Wed, Oct 02, 2019, 12:17 PM
  • ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన 'సైరా'
  • సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మెగా మూవీ
  • తన తండ్రికి ధన్యవాదాలు తెలిపిన రామ్ చరణ్
ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదలైన 'సైరా' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి షోతోనే సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. సినిమా అత్యద్భుతంగా ఉందంటూ చిరంజీవి అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ ద్వారా రామ్ చరణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 'ఈ బాస్ బస్టర్ కు ధన్యవాదాలు నాన్నా' అని తన తండ్రికి థ్యాంక్స్ చెప్పాడు. తన తండ్రి తనను ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేశాడు.


X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad