kamal: 'భారతీయుడు 2'లో విలన్ గా అనిల్ కపూర్?

  • షూటింగు దశలో 'భారతీయుడు 2'
  •  తప్పుకున్న అజయ్ దేవగణ్
  • కథానాయికలుగా కాజల్ - రకుల్  

శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'భారతీయుడు' సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాంతో కొంతకాలం క్రితం ఆ సినిమాకి సీక్వెల్ చేసేందుకు శంకర్ రంగంలోకి దిగాడు. లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా అనిల్ కపూర్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది.

ముందుగా ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రకి అజయ్ దేవగణ్ ను అనుకున్నారు. అయితే ఈ సినిమా షెడ్యూల్స్ లో మార్పులు జరగడం వలన, ఆయన డేట్స్ కుదరక తప్పుకున్నాడట. దాంతో దర్శక నిర్మాతలు అనిల్ కపూర్ ను సంప్రదించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయని సమాచారం. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, రకుల్ .. సిద్ధార్థ్ .. ఐశ్వర్య రాజేశ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

More Telugu News