Nani: యావరేజ్ మూవీగానే నిలిచిన 'నానీస్ గ్యాంగ్ లీడర్'

  • ఈ నెల 13న వచ్చిన 'నానీస్ గ్యాంగ్ లీడర్'
  • 17 రోజుల్లో 40 కోట్ల గ్రాస్ 
  • నాని తదుపరి చిత్రంగా 'వి'

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని కథానాయకుడిగా రూపొందిన 'నానీస్ గ్యాంగ్ లీడర్' .. క్రితం నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ కూడిన వినోదభరిత చిత్రంగా ఈ సినిమా అలరించింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను .. యూత్ ను ఆకట్టుకున్న ఈ సినిమా, మాస్ ఆడియన్స్ ఆదరణ పొందలేకపోయింది. దాంతో హిట్ చిత్రాల జాబితాలో చేరవలసిన ఈ సినిమా, యావరేజ్ సినిమాగానే మిగిలిపోయింది.

మొత్తంగా 28 కోట్లకి బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా, 30 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయింది. 17 రోజుల్లో ఈ సినిమా 40 కోట్ల గ్రాస్ ను .. 23 కోట్లకి పైగా షేర్ ను వసూలు చేసింది. వసూళ్ల పరంగా చూసినా ఇది యావరేజ్ సినిమానే అని చెప్పుకుంటున్నారు. ఒక మంచి హిట్ నాని చేతివరకూ వచ్చి జారిపోయిందనే అనుకుంటున్నారు. ఆయన తదుపరి చిత్రంగా 'వి' రూపొందుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News