Vineeth: ఒరిజినల్ మొసలితో ఫైట్ చేయవలసి వచ్చింది: హీరో వినీత్

  • 'శక్తి' అనే తమిళ సినిమా చేశాను 
  • పొల్లాచ్చిలో షూటింగ్ పెట్టారు 
  • డమ్మీ మొసలి పెట్టలేకపోయారన్న వినీత్

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సీనియర్ హీరో వినీత్ మాట్లాడుతూ, ఒక సినిమా షూటింగులో తనకి ఎదురైన అనుభవాన్ని గురించి ప్రస్తావించాడు. "తమిళంలో కుంజుమోన్ నిర్మాతగా 'శక్తి' సినిమా చేశాను. ఆ సినిమాలోని ఒక సీన్లో నేను మొసలి బారి నుంచి ఏనుగును కాపాడాలి. ఆ ప్రయత్నంలో భాగంగా మొసలితో ఫైట్ చేయాలి. అయితే కొన్ని కారణాల వలన దర్శక నిర్మాతలు డమ్మీ మొసలిని ఏర్పాటు చేయలేకపోయారు. దాంతో నిజం మొసలిని తీసుకొచ్చి, దాని నోటిని ఐరన్ వైర్ తో చుట్టేశారు.

నిజం మొసలితో ఫైట్ సీన్ అనడంతో నేను చాలా భయపడ్డాను. కణల్ కన్నన్ .. ఆయన అసిస్టెంట్ పీటర్ హెయిన్స్ ఇద్దరూ కూడా 'ఏం ఫరవాలేదు' అని చెప్పారు. పొల్లాచ్చిలోని ఒక లొకేషన్లో ఆ ఫైట్ సీన్ తీశారు. ఎందుకో తెలియదుగానీ బ్రేక్ చెప్పేవరకూ అది సైలెంట్ గా వుండిపోయింది. ఆ తరువాత అది ఒక్కసారిగా వైలెంట్ గా మారిపోయి నానా బీభత్సం చేసింది. షూటింగు సమయంలో అది అలా చేసి వుంటే నా పరిస్థితి వేరేలా ఉండేది" అంటూ ఆయన నవ్వేశాడు.

More Telugu News