Allu Arjun: కోటి వ్యూస్ ను రాబట్టేసిన 'సామజవరగమన' సాంగ్

  • తమన్ బాణీలోని కొత్తదనం 
  • సిరివెన్నెల పదాల్లోని అందమైన అల్లిక 
  • సిద్ శ్రీరామ్ వాయిస్ లో ప్రత్యేకతే కారణమంటున్న ఫ్యాన్స్

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' చిత్రం రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'సామజవరగమన' అనే పాటను విడుదల చేశారు.

తమన్ బాణీకి సిరివెన్నెల సాహిత్యాన్ని అందించగా, సిద్ శ్రీరామ్ ఆలపించాడు. విడుదలైన 24 గంటల్లోనే ఈ పాటకి 60 లక్షల వ్యూస్ రాగా, 3 లక్షల లైక్స్ వచ్చాయి. ఇప్పటికి ఈ పాట కోటి వ్యూస్ ను రాబట్టేసింది. ఇటీవల కాలంలో ఇంత వేగంగా ఈ స్థాయి వ్యూస్ ను .. లైక్స్ ను అందుకున్న లిరికల్ వీడియో సాంగ్ మరొకటి లేదని చెబుతున్నారు. తమన్ బాణీలో కొత్తదనం .. సిరివెన్నెల పదాల్లోని అందమైన అల్లిక .. సిద్ శ్రీరామ్ వాయిస్ లోని ప్రత్యేక ఈ పాటకి ఈ స్థాయి ఆదరణ తెచ్చిపెట్టాయని చెప్పుకుంటున్నారు.

More Telugu News