Jagan: ప్రజాధనంతో ఒక మతాన్ని పెంచి పోషిస్తున్నారు: జగన్ సర్కార్ పై కన్నా ఫైర్

  • హిందూ దేవాలయాల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తున్నారు
  • సామాన్యుడికి ఇసుక లభ్యం కావడం లేదు
  • 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు కావడం లేదు

జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ప్రజా ధనంతో కేవలం ఒక మతాన్ని పెంచి పోషిస్తున్నారని దుయ్యబట్టారు. హిందూ దేవాలయాల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని చెప్పారు.

నూతన ఇసుక పాలసీ అమల్లోకి వచ్చి నెల రోజులు కావస్తున్నా... సామాన్యుడికి ఇసుక లభ్యం కావడం లేదని విమర్శించారు. కేంద్రం తీసుకువచ్చిన 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లు ఏపీలో అమలు కావడం లేదని... ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 4న రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. ఇసుక కొరతపై 7న భిక్షాటన చేపడతామని... 11న పోలవరంలో పర్యటిస్తామని తెలిపారు. పారిపాలనలో టీడీపీ, వైసీపీ మధ్య ఎలాంటి తేడా లేదని అన్నారు. ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకి బీజేపీ అద్దె మైకులా పని చేయదని చెప్పారు.

More Telugu News