Balineni: నాలుగు రోజుల్లో బొగ్గు కొరతను అధిగమిస్తాం: మంత్రి బాలినేని వెల్లడి

  • వర్షాలు, సమ్మె వల్ల బొగ్గు కొరత ఏర్పడిందన్న మంత్రి
  • కోతలకు గత ప్రభుత్వ తప్పిదాలే కారణమని ఆరోపణ
  • రూ.20 వేల కోట్ల మేర నష్టాల్లో ఉన్నామని వెల్లడి

ఏపీలో కరెంటు కోతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. ప్రధానంగా థర్మల్ విద్యుదుత్పత్తి కుంటుపడిన నేపథ్యంలో, బొగ్గు కొరతను నాలుగు రోజుల్లో అధిగమిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భారీ వర్షాలు, సమ్మె వల్ల బొగ్గు కొరత ఏర్పడిందని అన్నారు. పీపీఏలపై ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చిందని వెల్లడించారు. అయితే విద్యుత్ కోతలకు గత ప్రభుత్వ తప్పిదాలే కారణమని బాలినేని ఆరోపించారు. ప్రస్తుతం రూ.20 వేల కోట్ల మేర నష్టాల్లో ఉన్నామని చెప్పారు.

More Telugu News