ap7am logo

ప్రేమికులకు రక్షణ కల్పించండి: హెచ్ఆర్సీ

Wed, Feb 13, 2013, 01:47 PM
వేలంటైన్స్ డే.. నాడు (ఫిబ్రవరి14) యువతీ, యువకులు ప్రేమ పక్షుల్లా విహరిస్తుంటారు. ముఖ్యంగా నగరాలలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ, ప్రేమికుల దినోత్సవాన్ని భజరంగ్ దళ్ ఎప్పటినుంచో వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇది మన భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని చెబుతూ ఏటా ఆ రోజున నిరసన వ్యక్తం చేస్తోంది. అంతేకాదు, ఆ రోజున భజరంగ్ దళ్ కార్యకర్తలు నగరాలలో సంచరిస్తూ కనిపించిన జంటలకు బలవంతంగా పెళ్ళిళ్ళు చేయిస్తున్నారు. 
ఎప్పటిలానే ఈ ఏడాది కూడా వేలంటైన్స్ డే (రేపు) రోజున ప్రేమికులు చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తే పట్టుకుని కల్యాణం జరిపిస్తామని భజరంగ్ దళ్ రాష్ట్ర శాఖ హెచ్చరించింది. విదేశీ సంస్కృతిని ప్రోత్సహిస్తే ఊరుకోమని ప్రకటించింది. దీనిపై ఈ రోజు రాష్ట్ర మానవహక్కుల సంఘం స్పందించింది. భజరంగ్ దళ్ బలవంతపు పెళ్ళిళ్ళను అడ్డుకోవడానికి చర్యలు చేపట్టాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ను ఆదేశించింది. 
Tags:
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Latest Video News..
Advertisement