Kodela: లక్ష రూపాయల కోసం కోడెల కక్కుర్తి పడ్డారని దుష్ప్రచారం చేశారు: చంద్రబాబు ఆవేదన

  • నరసరావుపేటలో కోడెల సంస్మరణ సభ
  • కోడెల విగ్రహావిష్కరణ చేసిన చంద్రబాబు
  • కోడెల మృతి జీర్ణించుకోలేకపోతున్నామంటూ వ్యాఖ్యలు

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ రోజు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కోడెల విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, కేవలం రూ. లక్ష కోసం కోడెల కక్కుర్తిపడ్డారని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారని, ఫర్నిచర్ కేసు పెట్టి వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. కోడెలపై తప్పుడు కేసులు పెట్టిన విషయం తెలిసి ఆయనను ఓదార్చానని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.

రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ నీతులు చెబుతున్నారని, పోలీసులను వాడుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పల్నాటిపులిగా పేరుగాంచిన కోడెల మృతిచెందిన విధానాన్ని ఇప్పటికీ తాము జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News