Sensex: బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులపై ఒత్తిడి.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 155 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 37 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 15 శాతంపైగా నష్టపోయిన యస్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్ లో నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో సెన్సెక్స్ ఒకానొక సమయంలో 421 పాయింట్లు పతనమైంది. అయితే చివర్లో ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకి తదితర హెవీ వెయిట్ కంపెనీల షేర్ల కొనుగోళ్లు ఊపందుకోవడంతో... మార్కెట్లు నష్టాలను తగ్గించుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 155 పాయింట్లు నష్టపోయి 38,667కి పడిపోయింది. నిఫ్టీ 37 పాయింట్లు కోల్పోయి 11,474 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (5.29%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.29%), ఇన్ఫోసిస్ (2.93%), ఐటీసీ ( 2.69%), టీసీఎస్ (2.06%).

టాప్ లూజర్స్:  
యస్ బ్యాంక్ (-15.06%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-6.84%), ఎస్బీఐ (-3.68%), ఐసీఐసీఐ బ్యాంక్ (-3.51%), సన్ ఫార్మా (-3.02%).

More Telugu News