Varun tej: 'గద్దలకొండ గణేశ్' 10 రోజుల వసూళ్లు

  • ఈ నెల 20న బరిలోకి దిగిన 'గద్దలకొండ'
  • ఒక్క నైజామ్ ఏరియాలోనే 7.78 కోట్ల షేర్ 
  • తెలుగు రాష్ట్రాల్లో 20.84 కోట్ల షేర్

హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా రూపొందిన 'గద్దలకొండ గణేశ్' .. ఈ నెల 20వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా, తొలిరోజునే పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా తన దూకుడు చూపిస్తూ వచ్చింది.

నైజామ్ లో 7.78 కోట్ల షేర్ ను .. సీడెడ్ లో 3.53 కోట్లు .. వైజాగ్ లో 2.51కోట్లు .. తూర్పుగోదావరిలో 1.63 కోట్లు .. పశ్చిమ గోదావరిలో 1.41 కోట్లు .. కృష్ణా జిల్లాలో 1.40 కోట్లు .. గుంటూరులో 1.72 కోట్లు .. నెల్లూరులో 86 లక్షల షేర్ ను రాబట్టింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఈ 10 రోజుల్లో 20.84 కోట్ల షేర్ ను వసూలు చేసింది. మొత్తానికి సరైన సమయంలో వచ్చి వరుణ్ తేజ్ గట్టి హిట్ నే తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వచ్చేనెల 2వ తేదీ నుంచి 'సైరా' రంగంలోకి దిగుతోంది గనుక, థియేటర్ల సంఖ్య .. వసూళ్లు భారీగా తగ్గే అవకాశం వుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

More Telugu News