soudi arabia: ఇరాన్‌ దూకుడును అడ్డుకోవాలి...లేదంటే చమురు ధరలను అడ్డుకోలేం: సౌదీ యువరాజు

  • ధరలు జీవితకాలం గరిష్టానికి చేరే అవకాశం
  • అంతర్జాతీయ వ్యవస్థే కుప్పకూలే అవకాశం ఉంది
  • ప్రపంచ దేశాలు తక్షణం స్పందించాలి

ఇరాన్‌ దూకుడును అడ్డుకోకుంటే చమురు ధరలు అనూహ్యంగా పెరిగి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోయేందుకు అది దారితీయవచ్చునని సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌బిన్‌ సల్మాన్‌ హెచ్చరించారు. సౌదీలోని అతిపెద్ద చమురు సంస్థ ఆరామ్‌కోకు చెందిన ఆబ్‌ ఖైక్‌, ఖురైస్‌ శుద్ధి కేంద్రాలపై ఇరాన్‌తో సంబంధాలున్న హైతీ తిరుగుబాటుదారులు ఈ నెల మొదట్లో డ్రోన్‌ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన అనంతరం జరిగిన పరిణామాలు చమురు ఎగుమతులపై ఆరు శాతం ప్రభావితం అయ్యాయి.

ప్రపంచంలోని పలు దేశాలకు 30 శాతం ఎగుమతులు, 20 శాతం వాణిజ్య వర్గాలకు మిడిల్‌ ఈస్ట్‌ ప్రాంతం కీలకం. అందుకే ఆ స్థాయిలో ప్రభావం కనిపించింది. ఈ దాడికి ఇరాన్‌ ప్రభుత్వమే కారణమని సౌదీ, అమెరికా ఆరోపిస్తున్నాయి. దీంతో సౌదీ, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో యువరాజు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్‌ తీరుపై ప్రపంచ దేశాలు తక్షణం స్పందించాలని, లేదంటే ఉద్రిక్తతలు మరింత పెరిగి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ధరలు జీవితకాలం గరిష్టానికి చేరే అవకాశం ఉందని హెచ్చరించారు.

More Telugu News