Kashmir: కశ్మీర్ విషయంలో.. భారత్ పై విషం కక్కిన మలేషియా

  • ఐరాస తీర్మానాలకు వ్యతిరేకంగా భారత్ వ్యవహరిస్తోందన్న మలేషియా ప్రధాని
  • కశ్మీర్ సమస్యను భారత్-పాక్ సామరస్యంగా పరిష్కరించుకోవాలి
  • ఆక్రమణ ద్వారా సమస్యను పరిష్కరించవద్దని మోదీకి చెప్పాను

కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ కు వత్తాసు పలుకుతున్న దేశాల జాబితాలో ఇప్పుడు మలేషియా కూడా చేరింది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో భారత్ పై విషం కక్కింది. సభలో మలేషియా ప్రధాని మహితిర్ మహమ్మద్ మాట్లాడుతూ... ఐరాస తీర్మానాలకు వ్యతిరేకంగా భారత్ వ్యవహరించిందని అన్నారు. కశ్మీర్ సమస్యను భారత్-పాక్ సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

అనంతరం మీడియాతో మహితిర్ మాట్లాడుతూ, ఈ నెల 5న రష్యాలో మోదీతో భేటీ అయ్యానని... కశ్మీర్ అంశాన్ని ఆక్రమణ ద్వారా కాకుండా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆ సందర్భంగా సూచించానని చెప్పారు. ఆర్టికల్ 370ని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో మోదీ తనకు వివరించారని తెలిపారు. మరోవైపు, భారత్ కు వ్యతిరేకంగా మలేషియా ప్రధాని స్పందించడం ఇదే తొలి సారి కాదు. ముస్లిం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ విషయంలో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

More Telugu News