Imran Khan: అనేక దేశాధినేతలకు భారత్ ఓ పెద్ద మార్కెట్... మనుషుల కంటే వ్యాపారమే ముఖ్యమైపోయింది: ఇమ్రాన్ ఖాన్ నిర్వేదం

  • ఐక్యరాజ్యసమితిలో ఇమ్రాన్ యుద్ధోన్మాద ప్రసంగం
  • ఎవరూ మద్దతు పలకని వైనం
  • నిరాశలో ఇమ్రాన్ ఖాన్

ఐక్యరాజ్యసమితిలో వీరావేశంతో ప్రసంగించినా తమ వాదనకు ఎవరూ మద్దతు పలకకపోవడం పట్ల పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నైరాశ్యంలో మునిగిపోయారు. కశ్మీర్ విషయంలో తగిన విధంగా మద్దతు రాబట్టలేకపోయామని అంగీకరించిన ఇమ్రాన్ ఖాన్, ఏదో ఒకరోజున ప్రపంచ దేశాలన్నీ నిజాన్ని తెలుసుకుంటాయని వ్యాఖ్యానించారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. "అనేక దేశాల అధినేతలకు భారత్ అంటే ఓ పెద్ద మార్కెట్. 120 కోట్ల మందితో కూడిన ఆ వాణిజ్య కేంద్రానికి ఇచ్చిన విలువ మనుషులకు ఇవ్వరా? మనుషుల కంటే వ్యాపారమే ముఖ్యమైపోయిందా?" అంటూ విస్మయం వ్యక్తం చేశారు.

More Telugu News