Jagan: బొగ్గు కొరతతో తగ్గిన విద్యుదుత్పత్తి... కేంద్రానికి లేఖ రాసిన సీఎం జగన్

  • భారీ వర్షాలు, కార్మికుల సమ్మెతో తగ్గిన బొగ్గు ఉత్పత్తి
  • ఏపీ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత
  • ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరిన ఏపీ సీఎం
  • సరఫరా పెంచాలని కేసీఆర్ ను కోరిన వైనం

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడినా, డ్యాములన్నీ జలకళ ఉట్టిపడుతున్నా అప్రకటిత విద్యుత్ కోతలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వర్షా కాలంలో రాష్ట్రంలో విద్యుత్ కోతలు రావడానికి అసలు కారణం బొగ్గు. ఏపీలో వినియోగంలో ఉన్న విద్యుత్ లో చాలా భాగం థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచే వస్తోంది. అయితే కొన్నిరోజులుగా బొగ్గు కొరత కారణంగా థర్మల్ విద్యుత్ ఉత్పాదన గణనీయంగా తగ్గింది. దాంతో విద్యుత్ కోతలు తప్పడంలేదని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ కేంద్ర మైనింగ్ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. బొగ్గు సరఫరాలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు కార్మికుల సమ్మె కారణంగా సింగరేణి, మహానంది గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి కుంటుపడింది. ఆ ప్రభావం కాస్తా థర్మల్ విద్యుదుత్పత్తిపై పడింది. ఈ క్రమంలో ప్రస్తుతం సింగరేణి నుంచి సరఫరా చేస్తున్న 4 ర్యాకుల బొగ్గును 9 ర్యాకులకు పెంచాలని అటు తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా జగన్ విజ్ఞప్తి చేశారు.

More Telugu News