TTD: నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

  • తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
  • వసంత మంటపంలో అంకురార్పణ
  • రాత్రికి మాడవీధుల్లో విహరించనున్న కోనేటిరాయుడు

తిరుమల కొండపై కొలువున్న శ్రీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. నేటి రాత్రి 7 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. తిరుమల వసంత మంటపంలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం విష్వక్సేనుడు మాడవీధుల్లో విహరించనున్నారు. రేపు సాయంత్రం 5 గంటల 23 నిమిషాలకు ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. బ్రహ్మోత్సవాల కారణంగా 9 రోజుల పాటు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

More Telugu News