Jammu And Kashmir: కశ్మీర్‌పై పాకిస్థాన్‌కు ఎందుకంత అత్యుత్సాహం : భారత్‌ ఎంపీలు

  • కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ సదస్సులో దాయాది తీరును ఎండగట్టిన సభ్యులు
  • తొలి నుంచి పాకిస్థాన్‌ది ఉగ్రమార్గమేనని ఎద్దేవా
  • నేటితో ముగియనున్న సదస్సు

జమ్మూకశ్మీర్‌లో సైనిక దళాలను మోహరించి ఉద్రిక్తతలకు భారత్‌ కారణమవుతోందంటూ పాకిస్థాన్‌ చేసిన ఆరోపణలను భారత్‌ పార్లమెంట్‌ సభ్యులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఉగాండాలో జరుగుతున్న కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ సదస్సులో నిన్న కశ్మీర్‌ అంశాన్ని పాకిస్థాన్‌ ప్రస్తావిస్తూ భారత్‌ తీరును తప్పుపట్టింది.

దీంతో సదస్సుకు హాజరైన భారత్‌ ప్రతినిధులు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, ఎంపీలు అధిర్‌ రంజన్‌ చౌదరి, రూపాగంగూలీ, ఎల్‌.హనుమంతయ్యలు దాయాది దేశానికి దీటైన సమాధానం ఇచ్చారు. భారత్‌లో అంతర్భాగమైన కశ్మీర్‌పై పాకిస్థాన్‌కు ఎందుకంత అత్యుత్సాహమని ప్రశ్నించారు.

సరిహద్దు రాష్ట్రంలో తొలి నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది పాకిస్థానేనని, వారిది ఉగ్ర సంప్రదాయమని విరుచుకుపడ్డారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ ఎక్కువ ప్రచారం కల్పిస్తోందని ధ్వజమెత్తారు. కాగా ఈ సదస్సు ఆదివారంతో ముగియనుంది.

More Telugu News