Godavari: బోటును వెలికితీసే పనులు కాకినాడకు చెందిన ధర్మాడి సత్యానికి అప్పగింత

  • సెప్టెంబరు 15న బోటు ప్రమాదం
  • గోదావరిలో మునిగిపోయిన బోటు
  • పెద్ద సంఖ్యలో మరణాలు
  • ఇప్పటికీ కొందరి ఆచూకీ దొరకని వైనం

ఇటీవలే గోదావరి నదిలో బోటు మునిగిపోయి పెద్ద సంఖ్యలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొందరి ఆచూకీ తెలియరాలేదు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద నిండు గోదావరిలో బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదం జరిగింది సెప్టెంబరు 15న కాగా, గోదావరి నదీ గర్భం నుంచి ఇప్పటివరకు బోటును వెలికితీయలేకపోయారు. దాదాపు 300 అడుగుల లోతున ఉన్న బోటును వెలికి తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా వెనుకంజ వేశాయి. అయితే కొందరు ప్రయివేటు వ్యక్తులు బోటును బయటికి తీస్తామంటూ ముందుకు వచ్చినా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది.

అయితే, తమపై విమర్శలు తీవ్రమవుతున్న నేపథ్యంలో బోటును ప్రయివేటు వ్యక్తులతోనే వెలికితీయించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం అనే వ్యక్తికి చెందిన బాలాజీ మెరైన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. రేపటినుంచే బోటు వెలికితీత పనులు మొదలుకానున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రూ.22.70 లక్షలకు వర్క్ ఆర్డర్ జారీ చేశారు.

More Telugu News