Sye Raa Narasimha Reddy: ‘సైరా’ కాస్ట్యూమ్స్ డిజైన్ కోసం హిస్టరీ బుక్స్ తిరగేశాను: సుస్మిత

  • 18వ శతాబ్దంలో దుస్తులు, యాక్సెసరీస్ ఎలా వాడారో తెలుసుకున్నా
  • ‘రఫ్ స్కెచెస్’ వేసుకుని ఫ్యాబ్రిక్ తయారు చేశాం
  • ‘సైరా’కు ‘వన్ మ్యాన్ ఆర్మీ’గా ఎవరూ పని చేయలేము

ప్రముఖ హీరో చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పని చేసిన చిరంజీవి తనయ సుస్మిత ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది. ఈ చిత్రంలో దుస్తుల డిజైన్ కోసం మా కాలేజ్ లైబ్రరీలో హిస్టరీ బుక్స్ తిరగేయడంతో తన పని ప్రారంభించానని గుర్తుచేసుకున్నారు.

18వ శతాబ్దంలో ఉన్న దుస్తులు, యాక్సెసరీస్, లెదర్ ను ఎలా వాడారో తెలుసుకుని తద్వారా ‘రఫ్ స్కెచెస్’ వేసుకుని ఫ్యాబ్రిక్ తయారు చేయడం, ఆ దుస్తులు ఏ రంగుల్లో ఉండాలి.. ఇలా అన్నీ బాగా ఆలోచించి తయారు చేయడం జరిగిందని అన్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి కూతురుగా కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశానని అన్నారు.

‘సైరా’ అంత పెద్ద సినిమాకు ‘వన్ మ్యాన్ ఆర్మీ’గా ఎవరూ పని చేయలేము. కాస్ట్యూమ్ డిపార్టుమెంట్ లోనే చాలా మంది ఉన్నామని అన్నారు. ఈ చిత్రంలో నాలుగు లీడ్ రోల్స్ కు దుస్తులు రూపొందించానని, మిగిలిన పెద్ద యాక్టర్స్ కు ఉత్తరామీనన్ డిజైన్ చేశారని చెప్పారు. అమితాబ్ బచ్చన్ తో కలిసి పని చేయడం ‘నాకు అయితే బిగ్ లెర్నింగ్ ప్రాసెస్’ అని సంతోషం వ్యక్తం చేశారు. ‘సైరా’ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశానన్న సంగతిని, పడ్డ కష్టాన్ని మర్చిపోయానని, ఈ సినిమా విడుదల కోసం ఓ మెగా అభిమానిగా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నానని అన్నారు.

More Telugu News