Akhilapriya: యురేనియం తవ్వకాలపై గళం విప్పిన అఖిలప్రియ

  • ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్
  • ఆళ్లగడ్డలో యురేనియం ప్లాంట్ అంగీకరించబోమని స్పష్టీకరణ
  • ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని వ్యాఖ్యలు

మాజీ మంత్రి అఖిలప్రియ నల్లమలలో యురేనియం తవ్వకాలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అడవులను ధ్వంసం చేసి మరీ యురేనియంను తవ్వితీయాల్సినంత అవసరం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఏమొచ్చిందని ప్రశ్నించారు. నల్లమల అటవీప్రాంతంలో యురేనియం తవ్వకాల కారణంగా స్థానికంగా నివసించే చెంచులు, సమీప గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఆళ్లగడ్డ మండలం యాదవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, యురేనియం తవ్వకాలను నిరోధించాలని కోరారు. కడప జిల్లా తుమ్మలపల్లె గ్రామవాసుల పరిస్థితి చూశామని, ఆళ్లగడ్డలో యురేనియం ప్లాంట్ ను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని అఖిలప్రియ స్పష్టం చేశారు. దీనిపై ట్వీట్ చేసిన ఆమె చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, లోక్ సత్తా జేపీలను ట్యాగ్ చేశారు.

More Telugu News