Visakhapatnam District: మావోయిస్టు అగ్రనేతలు పట్టుబడ్డారంటూ ప్రచారం... వట్టిదేనన్న విశాఖ ఎస్పీ

  • విశాఖ ఏజెన్సీలో కాల్పుల మోత
  • కూంబింగ్ కొనసాగుతోందని చెప్పిన విశాఖ ఎస్పీ
  • మావోయిస్టు భవానీ తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు పట్టుబడిందని వెల్లడి

గత కొన్నిరోజులుగా విశాఖ మన్యం, ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఐదుగురు మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. అయితే, కూంబింగ్ సందర్భంగా మావోయిస్టు అగ్రనేతలు పట్టుబడ్డారంటూ కథనాలు వస్తున్నాయి. దీనిపై విశాఖ జిల్లా ఎస్పీ బాబూజీ వివరణ ఇచ్చారు. కూంబింగ్ లో మావోయిస్టు అగ్రనేతలు పట్టుబడ్డారని వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కూంబింగ్ జరుగుతోందని చెప్పారు. ఈ నెల 22, 23వ తేదీల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో ఐదుగురు మావోలు మృతి చెందారని, మృతులందరూ చత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందినవారని ఎస్పీ వెల్లడించారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో ఓ ఏకే-47, ఇతర ఆయుధాలు దొరికాయని వివరించారు. మహిళా మావోయిస్టు భవానీ తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు పట్టుబడిందని తెలిపారు.

More Telugu News