Imran Khan: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై రాజ్ నాథ్ సింగ్ వ్యంగ్యం

  • ఐక్యరాజ్యసమితి సమావేశంలో భారత్ పై విషం చిమ్మిన ఇమ్రాన్ ఖాన్
  • పాక్ ప్రధాని సాధించింది ఏమీలేదన్న రాజ్ నాథ్ సింగ్
  • ఎలాంటి దాడుల్నయినా ఎదుర్కొంటాం అంటూ ధీమా

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ పై విద్వేషం వెళ్లగక్కిన నేపథ్యంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ప్రతి దేశం తలుపుతట్టి పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సాధించింది ఏదైనా ఉందంటే అది కార్టూనిస్టులకు పని కల్పించడమేనని వ్యంగ్యం ప్రదర్శించారు. పాక్ ప్రధాని వ్యాఖ్యలు కార్యూనిస్టులు హాస్యం పండించడానికి బాగా ఉపయోగపడుతున్నాయని ఎద్దేవా చేశారు.

ముంబయిలో అత్యాధునిక స్కార్పియన్ క్లాస్ సబ్ మెరైన్ ఖండేరీ, ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధనౌకలను నౌకాదళంలో చేర్చే కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ ఎలాంటి కుట్రకు పాల్పడినా ఎదుర్కొనే సత్తా భారత బలగాలకు ఉందని స్పష్టం చేశారు. భారత్ పై భీకర ఉగ్రదాడులు చేసేందుకు పాక్ సిద్ధంగా ఉందని, ప్రాంతీయంగా శాంతికి విఘాతం కలిగించే ఎలాంటి శక్తులనైనా భారత నావికాదళం తుత్తునియలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News