New Delhi: ఢిల్లీలో దొంగల దూకుడు... న్యాయమూర్తిని వెంబడించి మరీ పర్స్‌ కొట్టేసిన వైనం

  • కారు అద్దాలు పగులగొట్టి అపహరణ
  • ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్దే దోపిడీ
  • దుండగుల తీరుతో బిత్తరపోయిన మహిళా జడ్జి

చోరీలు, దోపిడీలు, దొంగతనాలకు పాల్పడే వారికి వారూ, వీరూ అన్న తేడా ఏముంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా ఓ మహిళా న్యాయమూర్తినే టార్గెట్‌ చేశారు దుండగులు. విధులు ముగించుకుని కారులో ఇంటికి వెళ్తున్న ఆమెను వెంబడించి మరీ పర్స్‌ కొట్టేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు..

ఢిల్లీలోని సాకేత్‌ కోర్టులో విధులు నిర్వహిస్తున్న అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి మొన్న మంగళవారం ఇంటికి వెళ్తున్నారు. బైక్‌పై ఆమెను ఇద్దరు వ్యక్తులు వెంబడించారు. సరితా విహార్‌ అండర్‌పాస్‌కు చేరుకున్నాక ఆమె కారు వెనుక భాగం దెబ్బతిన్నదని ఆమెకు సైగలతో చెప్పారు. అయితే, న్యాయమూర్తి వారి మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు.

ఓఖ్లా ప్రాంతంలో సిగ్నల్స్‌ వద్ద ఆమె కారు ఆగగానే దుండగులు ఆమె కారు వద్దకు చేరుకున్నారు. కారు అద్దాలు పగులగొట్టి ఆమె పర్సు ఎత్తుకెళ్లారు. పట్టపగలే నడిరోడ్డుపై దోపిడీ జరగడంతో బిత్తరపోయిన న్యాయమూర్తి అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

More Telugu News