Pakistan: పాక్ ప్రధాని ఓ యుద్ధోన్మాదిలా మాట్లాడారు: విదేశాంగ ప్రతినిధి విదిషా మైత్ర

  • యూఎన్ ఓలో ఇమ్రాన్ ప్రసంగించిన తీరుపై విమర్శలు
  • ఇమ్రాన్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు
  • అల్ ఖైదాకు పింఛన్ ఇస్తున్న ఏకైక దేశం పాక్

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిన్న ప్రసంగించిన తీరుపై భారత విదేశాంగ ప్రతినిధి విదిషా మైత్ర అభ్యంతరం తెలిపారు. భారత్ పై విషం చిమ్మిన పాక్ కు ఆమె దీటుగా బదులిచ్చారు. ఈ విషయమై ఈరోజు ఆమె స్పందిస్తూ.. భారత ప్రధాని మోదీ ప్రసంగానికి, పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రసంగానికి ఎంతో తేడా ఉందని అన్నారు. యుద్ధానికి సిద్ధం అనే సందేశాన్ని ఇచ్చి ఇమ్రాన్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు. పాక్ ప్రధాని ఓ యుద్ధోన్మాదిలా మాట్లాడారని విమర్శించారు.

ఐక్యరాజ్యసమితి గుర్తించిన 25 ఉగ్రవాద సంస్థలు, 130 మంది ఉగ్రవాదులు పాక్ లో ఉన్న విషయాన్ని ఇమ్రాన్ ధ్రువీకరిస్తారా? ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాకు పింఛన్ ఇస్తున్న ఏకైక దేశం పాక్ అనే విషయాన్ని ఆ దేశం గుర్తించిందా? ఉగ్రవాదులకు ఆర్థికసాయం చేయకపోతే న్యూయార్క్ లోని హబీబ్ బ్యాంకును ఎందుకు మూసివేయాల్సి వచ్చిందో పాక్ వివరించగలదా? పాక్ ను ఎఫ్ఏటీఎఫ్ ఎందుకు నోటీసులో పెట్టిందో ప్రపంచ దేశాలకు వివరించగలదా? న్యూయార్క్ లో బిన్ లాడెన్ ను సమర్థించిన విషయాన్ని ఇమ్రాన్ ఖండించగలరా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

More Telugu News