Imran Khan: ఆ జాత్యహంకార విద్వేషమే మహాత్మాగాంధీని చంపేసింది: ఇమ్రాన్ ఖాన్

  • మోదీ, ఆరెస్సెస్ పై పాక్ ప్రధాని ధ్వజం
  • ముస్లింలను తరిమేయాలని ఆరెస్సెస్ భావించిందని ఆరోపణ
  • చర్చలు జరుపుదామంటే మోదీ నుంచి స్పందనలేదని వెల్లడి

ఓ అంతర్జాతీయ వేదికపై ప్రసంగించే అవకాశం రాగానే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రెచ్చిపోయారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్ పై విషం కక్కారు. భారత్ లో ఎన్నికల తర్వాత పరిస్థితి మారుతుందని ఆశించామని, కానీ ఎన్నికల తర్వాత ఆర్టికల్ 370ని రద్దు చేశారని ఆరోపించారు. జమ్మూకశ్మీర్ లో 9 లక్షల మంది సైనికులు, పోలీసులు ఉన్నారని వ్యాఖ్యానించారు.

"కశ్మీర్ లో ఉగ్రవాదం గురించి మోదీ మాట్లాడారు, నేను బలూచిస్తాన్ లో భారత గూఢచర్యం గురించి చెప్పాను. ఇవన్నీ పక్కనబెట్టి చర్చలు జరుపుదామంటే మోదీ నుంచి స్పందన రాలేదు" అని ఆరోపించారు. పుల్వామా దాడి తర్వాత ఆధారాలు చూపమని అడిగామని, సర్జికల్ స్ట్రయిక్ లో 300 మందిని చంపామని మోదీ చెప్పారని ఇమ్రాన్ వివరించారు. వాస్తవానికి అక్కడ కొన్ని చెట్లు కూలిపోయాయని, తామిప్పుడు వాటిని పెంచుతున్నామని వెల్లడించారు. ఇదంతా ట్రైలర్ అని మోదీ ఎన్నికల ప్రచారంలో చెప్పారని పేర్కొన్నారు.

ముస్లింలను భారత్ నుంచి తరిమేయాలని ఆరెస్సెస్ భావించిందని, ముస్లింలు, క్రిస్టియన్లంటే ఆరెస్సెస్ కి విద్వేషం అని అన్నారు. ఆ జాత్యహంకార పూరిత విద్వేషమే మహాత్మాగాంధీని చంపేసిందని విమర్శించారు.

More Telugu News