Karminagar: కోర్టు ధిక్కరణ కేసు.. కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డికి జైలు శిక్ష విధించిన న్యాయస్థానం

  • హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన కేసు
  • ముగ్గురు అధికారులకు జైలు, జరిమానా విధింపు
  • ఏసీపీ తిరుపతి, కరీంనగర్ రూరల్ ఎస్ హెచ్ వో శశిధర్ రెడ్డికి శిక్ష

హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన కేసులో కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) కమలాసన్ రెడ్డికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో కమలాసన్ రెడ్డి సహా ఏసీపీ తిరుపతి, కరీంనగర్ రూరల్ ఎస్ హెచ్ వో శశిధర్ రెడ్డికి శిక్ష విధించింది. ఈ ముగ్గురు అధికారులకు 6 నెలల జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. అప్పీల్ కు వెళ్లేందుకు నాలుగు వారాలపాటు తీర్పును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, గతంలో హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి స్థానిక పుష్పాంజలి రిసార్ట్స్ లోకి పోలీసులు ప్రవేశించారు. తన రిసార్ట్స్ లో రమ్మీ ఆడుతున్నారంటూ పోలీసులు వచ్చి వేధిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే జగపతిరావు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ నేపథ్యంలో పోలీసులకు హైకోర్టు గతంలో పలు సూచనలు చేసింది. అయితే, వాటిని సదరు పోలీసులు ఉల్లంఘించారు.

More Telugu News