Tejas: పశ్చిమ కనుమల్లో అరుదైన పాము.... ఉద్ధవ్ థాక్రే చిన్నకుమారుడి పేరిట నామకరణం

  • 125 ఏళ్ల కిందట తొలిసారి కనిపించిన క్యాట్ స్నేక్
  • 2015లో ఈ పామును చూసిన తేజస్ థాక్రే
  • క్యాట్ స్నేక్ పై విస్తృత పరిశోధన చేసిన తేజస్

విశాలమైన పర్వతశ్రేణి, దట్టమైన అడవులతో కూడిన పశ్చిమ కనుమలు అపార జీవవైవిధ్యానికి నెలవు అని చెప్పాలి. నాలుగేళ్ల కిందట పశ్చిమ కనుమల్లో ఓ అరుదైన పామును గుర్తించారు. దీని దేహంపై ఉండే మచ్చల కారణంగా క్యాట్ స్నేక్ అని పిలుస్తారు. ఇది చెట్ల మీదనే ఉంటూ హుమాయూన్స్ నైట్ అనే కప్పలను, వాటి గుడ్లను ఆరగిస్తుంది. ఇంతకీ ఈ పామును గుర్తించింది ఎవరో కాదు... శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే చిన్నకుమారుడు తేజస్ థాక్రే. 2015లో పశ్చిమ కనుమల్లో ఈ పామును చూసిన తేజస్ దానిపై లోతైన పరిశోధన చేపట్టారు. ఈ పరిశోధన పత్రాలను బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ జర్నల్ లో ప్రచురించారు.

తాజాగా, ఆ పాముకు తేజస్ థాక్రే పేరిట థాక్రే క్యాట్ స్నేక్ గా నామకరణం చేశారు. అంతేకాదు, దాని శాస్త్రీయ నామం కూడా బొయిగా థాకరేయిగా మార్చేశారు. పశ్చిమ కనుమల్లో 125 ఏళ్ల కిందట ఈ పాము తొలిసారి కనిపించగా, ఆ తర్వాత దర్శనమిచ్చింది నాలుగేళ్ల కిందట మాత్రమే. అందుకే ఈ పాముకు తేజస్ థాక్రే పేరిట నామకరణం చేశారు.

More Telugu News