Balakrishna: దసరా కానుకగా బాలయ్య మూవీ నుంచి టీజర్

  • బాలకృష్ణ నుంచి 105వ సినిమా 
  • సంగీత దర్శకుడిగా చిరంతన్ భట్ 
  • అక్టోబర్ 5 నుంచి తదుపరి షెడ్యూల్       

బాలకృష్ణ కథానాయకుడిగా ఆయన 105వ సినిమా షూటింగు చకచకా జరిగిపోతోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి, సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిఫరెంట్ లుక్ తో బాలకృష్ణ కనిపించే ఈ సినిమా, ఇప్పటికి కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది.

సోనాల్ చౌహాన్ - వేదిక కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, తదుపరి షెడ్యూల్ షూటింగును హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది. బాలకృష్ణతో పాటు ప్రధాన పాత్రధారులు పాల్గొనగా కొన్ని కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు.  ప్రకాశ్ రాజ్ .. జయసుధ .. భూమిక పాత్రలు ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. చిరంతన్ భట్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుందని చెబుతున్నారు. దసరా కానుకగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నారు.

More Telugu News