Varun Tej: పదో తరగతిలో ఉన్నప్పుడు తొలి ముద్దు ఇచ్చాను: వరుణ్ తేజ్

  • తొలి ముద్దు నాకు ఒక చెడు జ్ఞాపకం
  • దాని గురించి చెప్పలేను
  • ఇప్పటి వరకు నాకు ఎక్కువ ప్రపోజల్స్ రాలేదు

తాను పదో తరగతి చదువుతున్నప్పుడే తొలి ముద్దు ఇచ్చానని సినీ హీరో వరుణ్ తేజ్ తెలిపాడు. మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ఫీట్ అప్ విత్ స్టార్స్' కార్యక్రమంలో వరుణ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తొలి ముద్దు ఎప్పుడు ఇచ్చావని మంచు లక్ష్మి ప్రశ్నించగా... వరుణ్ ఈ మేరకు సమాధానమిచ్చాడు. అయితే, అది తనకు ఒక చెడు జ్ఞాపకమని... దాని గురించి ఏమీ చెప్పలేనని అన్నాడు.

ఫ్యాన్స్ తో మరిచిపోలేని సంఘటన ఏదైనా ఉందా? అనే ప్రశ్నకు బదులుగా... ఒక రోజు స్నేహితులతో కలసి ఓ క్లబ్ కు వెళ్లానని... పార్టీలో డ్యాన్స్ చేస్తుండగా వెనుక నుంచి ఓ అమ్మాయి తనను హత్తుకుందని వరుణ్ తెలిపాడు. తన స్నేహితుల్లో ఎవరో తనను పట్టుకున్నారని తొలుత అనుకున్నానని... అయితే అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తే అమ్మాయి కనిపించిందని చెప్పాడు. ఆ తర్వాత ఆమె తనను ముద్దు పెట్టుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలిపాడు. ఆ క్షణంలో తనకు ఎంతో భయం వేసిందని తెలిపాడు. తన జీవితంలో ఇప్పటి వరకు ఎక్కువ ప్రపోజల్స్ రాలేదని చెప్పాడు.

More Telugu News