Sharad Pawar: మనీ లాండరింగ్ కేసులో నేడు ఈడీ ముందుకు శరద్ పవార్.. కార్యాలయం వద్ద సెక్షన్ 144 విధింపు!

  • మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ మనీ లాండరింగ్ కుంభకోణంలో శరద్ పవార్
  • మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్న ఎన్సీపీ అధినేత
  • కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు

మనీ లాండరింగ్ కేసులో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. జనాలు భారీ సంఖ్యలో గుమికూడరాదని ఆంక్షలు విధించారు. మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ మనీ లాండరింగ్ కుంభకోణం విచారణకు సంబంధించి శరద్ పవార్ నేడు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు.

వాస్తవానికి శరద్ పవార్ కు ఇంత వరకు ఈడీ సమన్లు పంపలేదు. కానీ, మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో, రానున్న రోజుల్లో ప్రచారానికి సంబంధించి బిజీ కాబోతున్న నేపథ్యంలో... ఆయనే తనంతట తానుగా ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు సెక్షన్ 144 విధించారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నట్టు శరద్ పవార్ నిన్న ట్వీట్ చేశారు. ఈడీ కార్యాలయం వద్దకు ఎవరూ రావద్దంటూ పార్టీ శ్రేణులకు ఆయన విన్నవించారు.

More Telugu News