E-cigars: ఈ-సిగరెట్లు నిల్వచేస్తే ఆరు నెలల జైలు, జరిమానా విధిస్తాం: ఏపీ డీజీపీ సవాంగ్

  • ఈ-సిగరెట్ల ఉత్పత్తి, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకంపై నిషేధం
  • ఆన్ లైన్ లో అమ్మకం, ప్రకటనలపైనా నిషేధం  
  • అతిక్రమిస్తే ఏడాది జైలు లేదా రూ.2 లక్షల జరిమానా

ఈ-సిగరెట్లు నిల్వ చేస్తే ఆరు నెలల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తామని వ్యాపారులను ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ-సిగరెట్ల ఉత్పత్తి, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకంపై నిషేధం ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ-సిగరెట్లు ఆన్ లైన్ లో అమ్మకం, ప్రకటనలపైనా నిషేధం విధిస్తున్నామని, దీన్ని అతిక్రమిస్తే ఏడాది జైలు శిక్ష లేదా రూ.2 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇదే నేరానికి తిరిగి పాల్పడితే కనుక మూడేళ్ల జైలు, రూ.5 లక్షల జరిమానా విధిస్తామని అన్నారు.

More Telugu News