Andhra Pradesh: ఏపీ పదవ తరగతి పరీక్ష విధానంలో కీలక మార్పులు!

  • ఇంటర్నల్ మార్కులు రద్దు
  • ప్రధాన ప్రశ్నాపత్రంలోనే బిట్ పేపర్
  • జవాబులు రాసేందుకు 18 పేజీల బుక్ లెట్

మన విద్యా విధానంలో పదవ తరగతికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చాలామందికి భవిష్యత్తును నిర్ణయించే దశ ఇదే. అయితే, ఏపీలో పదవ తరగతి పరీక్షల విధానంలో పలు కీలక మార్పులు చేసేందుకు ప్రభుత్వం నిశ్చయించింది. చాలాకాలంగా అమల్లో ఉన్న ఇంటర్నల్ మార్కుల విధానం ఎత్తివేత, పరీక్ష సమయం పొడిగింపు, బిట్ పేపర్ ను కూడా ముందే ఇవ్వడం వంటి సంస్కరణలు తీసుకువస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఇంటర్నల్ మార్కుల విధానం కార్పొరేట్ పాఠశాలల్లో దుర్వినియోగం అవుతోందన్న ఆరోపణలు ఉన్నాయని చెప్పారు.

ఇకపై బిట్ పేపరును విడిగా కాకుండా ప్రధాన ప్రశ్నాపత్రంలోనే ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. పరీక్ష సమయాన్ని కూడా మరో పదిహేను నిమిషాలు పెంచుతున్నట్టు వెల్లడించారు. జవాబులు రాసేందుకు 18 పేజీల బుక్ లెట్ ఇస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానాలు అమల్లోకి వస్తాయని మంత్రి పేర్కొన్నారు.

More Telugu News