Gopichand: ఆసక్తిని రేపుతోన్న 'చాణక్య' ట్రైలర్

  • యాక్షన్ మూవీగా 'చాణక్య'
  • కరాచీ నేపథ్యంలో సాగే కథ 
  • కీలకమైన పాత్రలో జరీన్ ఖాన్

గోపీచంద్ కథానాయకుడిగా 'చాణక్య' చిత్రం రూపొందింది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను వచ్చేనెల 5వ తేదీన విడుదల చేయనున్నారు. 'తిరు' దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. లవ్ .. యాక్షన్ .. కామెడీకి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాలో గోపీచంద్ .. 'రామకృష్ణ' అనే బ్యాంకు ఉద్యోగిగా, 'అర్జున్' అనే RAW ఏజెంట్ గా కనిపిస్తున్నాడు. ఇది 'కరాచీ' నేపథ్యంలో మాఫియా చుట్టూ అల్లుకున్న కథ అనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ముఖ్యమైన పాత్రల్లో నాజర్ .. జరీన్ ఖాన్ .. రాజేశ్ ఖట్టర్ .. అరుణ్ కుమార్ కనిపిస్తున్నారు. భారీస్థాయిలో నిర్మితమైన ఈ సినిమా, ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

More Telugu News