Nagarjuna: 'బంగార్రాజు'లో చైతూ లేనట్టే!

  • నాగ్ క్రేజ్ ను పెంచిన 'బంగార్రాజు' పాత్ర 
  • 'బంగార్రాజు' టైటిల్ తో నాగ్ తాజా చిత్రం 
  • కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో పట్టాలపైకి

నాగార్జున కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా 'సోగ్గాడే చిన్నినాయనా' కనిపిస్తుంది. ఈ సినిమాలో నాగార్జున పోషించిన 'బంగార్రాజు' పాత్ర ఆయనకి మంచిపేరు తీసుకొచ్చింది. దాంతో ఈ పాత్ర పేరునే టైటిల్ గా చేసుకుని ఆయన ఒక సినిమాను నిర్మించాలనుకున్నారు. 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాను తెరకెక్కించిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో చైతూ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తనకి వున్న వరుస కమిట్ మెంట్స్ కారణంగా కుదరదని చైతూ చెప్పేశాడట. దాంతో ఆ పాత్రకి మరో హీరోను సెట్ చేసే ఆలోచనలో నాగార్జున వున్నారని అంటున్నారు. ప్రస్తుతం నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తోన్న 'బిగ్ బాస్ 3' పూర్తి కాగానే, 'బంగార్రాజు' సెట్స్ పైకి వెళుతుందని సమాచారం.

More Telugu News