Andhra Pradesh: అద్దె ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లు ఆహ్వానించిన ఏపీఎస్ ఆర్టీసీ

  • 350 ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకోనున్న ఆర్టీసీ
  • గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిన టెండర్లు 
  • పన్నెండేళ్ల కాలపరిమితికి ఈ టెండర్లు

ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునే నిమిత్తం ఏపీఎస్ ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. ఈ పద్ధతిలో 350 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ అద్దెకు తీసుకోనుంది. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిన టెండర్లు ఆహ్వానించింది. ఈ సందర్భంగా ప్రీబిడ్ సమావేశం నిర్వహించింది. రన్నింగ్ కిలో మీటర్ల ప్రాతిపదికన చెల్లింపులు చేసేలా పన్నెండేళ్ల కాలపరిమితికి ఈ టెండర్లు ఆహ్వానించింది. ఎలక్ట్రిక్ బస్సులపై అక్టోబర్ 14లోగా టెక్నికల్ బిడ్స్, నవంబర్ 1న ఫైనాన్షియల్ బిడ్డింగ్ కు ఆర్టీసీ వెళ్లనుంది.
 
టెండర్లు ఆహ్వానించిన రూట్లు..

- కాకినాడ-రాజమహేంద్రవరం-అమలాపురం
- గన్నవరం-హనుమాన్ జంక్షన్
- విజయవాడ- గుడివాడ-భీమవరం
- జగ్గయ్యపేట-మచిలీపట్నం
- నూజివీడు-కోదాడ
- విజయవాడ- అమరావతి, విజయవాడ-గుంటూరు
- విజయవాడ రైల్వేస్టేషన్- మంగళగిరి

More Telugu News