Jagan: జగన్ ప్రభుత్వం వచ్చాక కట్టిన మొట్టమొదటి కట్టడం ఇదే: వర్ల రామయ్య సెటైర్

  • రోడ్డుకు అడ్డంగా కట్టిన గోడను షేర్ చేసిన వర్ల రామయ్య
  • ప్రభుత్వ అసమర్థతకు ఈ గోడ ప్రతీక అంటూ వ్యాఖ్య
  • దళితుల మధ్య అగాధానికి కారణమైన ఈ గోడను పడగొట్టాలని విన్నపం

జగన్ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. రోడ్డుకు అడ్డంగా కట్టిన ఓ గోడను ట్విట్టర్ లో షేర్ చేసిన ఆయన... జగన్ ప్రభుత్వం వచ్చాక కట్టిన మొదటి కట్టడం ఇదేనని విమర్శించారు. తాజ్ మహల్ దేశ ప్రగతికి చిహ్నమైతే... ఈ గోడ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు ప్రతీక అని ఎద్దేవా చేశారు. తాజ్ మహల్ ను అందరూ ఆస్వాదిస్తుంటే... ఈ గోడను ప్రతి ఒక్కరూ ఈసడించుకుంటున్నారని అన్నారు. అక్రమ కట్టడమైన ఈ గోడ ప్రభుత్వ అసమర్థతను ప్రతిబింబిస్తోందని చెప్పారు. దళితుల మధ్య అగాధానికి కారణమైన ఈ గోడను పడగొట్టాలని, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని కోరారు.

More Telugu News