Sunny Leone: ‘కామసూత్ర’ వెబ్ సిరీస్‌లో సన్నీలియోన్.. కథ విని ఓకే అన్న సన్నీ

  • ఏక్తాకపూర్ దర్శకత్వం
  • సూత్రప్రాయంగా అంగీకరించిన సన్నీలియోన్
  • గతంలో వీరి కాంబోలో 'రాగిణి-ఎంఎంఎస్'    

బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీలియోన్ ‘కామసూత్ర’ వెబ్ సిరీస్‌లో నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు ఏక్తాకపూర్ దర్శకత్వం వహించనున్నట్టు బాలీవుడ్ భోగట్టా. ‘కామసూత్ర’లో నటించాలంటూ ఏక్తాకపూర్ ఇప్పటికే సన్నీని సంప్రదించినట్టు సమాచారం. కథ విన్న సన్నీ కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. గతంలో సన్నీ-ఏక్తాకపూర్‌లు ‘రాగిణి-ఎంఎంఎస్’ సినిమా కోసం కలిసి పనిచేశారు. కాగా, సన్నీలియోన్ ప్రస్తుతం తమిళ చిత్రం ‘వీరమాదేవి’ లో కీలకపాత్ర పోషిస్తోంది.

More Telugu News