polavaram: రివర్స్ టెండరింగ్ పై ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ బోగస్సే: బోండా ఉమ

  • పనుల నాణ్యతను గాలి కొదిలేసి తక్కువ ధరకు టెండర్ ఇచ్చారా?
  • టెండరింగ్ లో కనీసం ముగ్గురు పాల్గొనాలి?
  • పీపీఏలపై పున:సమీక్ష తప్పు అని కేంద్రం చెప్పింది

పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన రివర్స్ టెండరింగ్ పై ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ బోగస్సే అని టీడీపీ ఏపీ నేత బోండా ఉమ విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పనుల నాణ్యతను గాలి కొదిలేసి తక్కువ ధరకు టెండర్ ఇచ్చారా? టెండరింగ్ లో కనీసం ముగ్గురు పాల్గొనాలి, పాల్గొన్నారా? అని ప్రశ్నించారు.

పీపీఏలపై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ నుంచి ప్రభుత్వానికి ఓ లేఖ వచ్చిందని, పీపీఏలపై పున:సమీక్ష తప్పు అని అందులో పేర్కొన్నారని అన్నారు. రివర్స్ టెండరింగ్ లో లోపాయికారి ఒప్పందాలు బయటపడతాయని చెప్పిన బోండా, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు స్వస్తిపలికి రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడాలని హితవు పలికారు.

More Telugu News