Venkatesh: తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేశ్

  • వెంకటేశ్ తాజా చిత్రంగా 'వెంకీమామ'
  • ముగింపు దశకి చేరుకున్న చిత్రీకరణ 
  • హార్స్ రైడింగ్ నేపథ్యంలో నెక్స్ట్ మూవీ   

వెంకటేశ్ తాజా చిత్రంగా 'వెంకీమామ' రూపొందుతోంది. చిత్రీకరణపరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. బాబీ దర్శకత్వంలో పూర్తి వినోదభరిత చిత్రంగా నిర్మితమవుతోన్న ఈ సినిమా కోసం వెంకటేశ్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రానికి సంబంధించిన ఒక వార్త ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. వెంకటేశ్ తదుపరి చిత్రం తరుణ్ భాస్కర్ తో వుండనుందనేదే ఆ వార్త సారాంశం.

ఆ మధ్య తరుణ్ భాస్కర్ ఒక విభిన్నమైన కథాంశాన్ని వెంకటేశ్ కి వినిపించడం .. అది సురేశ్ బాబుకి కూడా నచ్చడం జరిగిపోయిందట. హార్స్ రైడింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి. 'పెళ్లి చూపులు' తరువాత తరుణ్ భాస్కర్ చేసిన 'ఈ నగరానికేమైంది' అంచనాలను అందుకోలేకపోయిందనే సంగతి తెలిసిందే.

More Telugu News