Gopichand: 'చాణక్య' నుంచి హుషారెత్తించే లిరికల్ వీడియో సాంగ్

  • స్పై థ్రిల్లర్ గా రూపొందిన 'చాణక్య'
  • ముఖ్యమైన పాత్రలో జరీన్ ఖాన్ 
  • అక్టోబర్ 5వ తేదీన విడుదల

'తిరు' దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా 'చాణక్య' సినిమా రూపొందింది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ స్పై థ్రిల్లర్ ను వచ్చేనెల 5వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

"బేబీ గులాబీ .. గులాబీ మా లైఫు లైను నువ్వే .. బేబీ గులాబీ .. గులాబీ మా లక్కీస్టారు నువ్వే" అంటూ ఈ పాట సాగుతోంది. గోపీచంద్ - మెహ్రీన్ పై ఈ సాంగ్ ను చిత్రీకరించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం .. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం .. అనురాగ్ కులకర్ణి ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాలో, జరీన్ ఖాన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. కొంతకాలంగా గోపీచంద్ వెయిట్ చేస్తోన్న హిట్, ఈ సినిమాతో ఆయనకి లభిస్తుందేమో చూడాలి.

More Telugu News